Supreme Court: Muslim women can claim maintenance after divorce
Supreme Court: క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న భర్త నుంచి ముస్లిం మహిళలు భరణం క్లెయిమ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. న్యాయమూర్తులు బివి నాగరత్న, ఆగస్టిన్ జార్జ్ మసిహ్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం పెళ్లయిన మహిళలకే కాకుండా మహిళందరికీ వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది.
అబ్దుల్ సమద్ తన మాజీ భార్యకు రూ.20000 భరణం చెల్లించాలని తెలంగాణ ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. సమద్ తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని సీఆర్పీసీ సెక్షన్ 125 కింద ఆ మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీనిని సవాలు చేస్తూ ప్రత్యేక చట్టం అయిన ముస్లింల మహిళల చట్టం సెక్షన్ 125 సీఆర్పీసీ నిబంధనలకు అనుగుణంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.