దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా పడుతున్న ఈ వర్షాలకు ముంబై మహానగరం నీటితో నిండిపోయింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.
Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా పడుతున్న ఈ వర్షాలకు ముంబై మహానగరం నీటితో నిండిపోయింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడిక్కడ నీళ్లు నిలిచిపోయాయి. అర్థరాత్రి నుంచి భారీ వర్షాలు కురవడంతో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మి, పోవాయ్లొ 341 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
వర్షాలకు సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగిపోవడంతో చాలా లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా కొనసాగుతోంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వెంటనే ఎన్టీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈరోజు కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
#WATCH | Mumbai, Maharashtra: Waterlogged railway tracks between Wadala and GTB stations.
Mumbai has recorded over 300 mm of rainfall from 1 am to 7 am today. More rain is expected during the day as well. pic.twitter.com/B9zzZs1bY4