»Lpg Gas Price Omcs Slash Commercial Gas Cylinder Prices From July 1 Check New Rates Here
LPG : ఆ గ్యాస్ సిలెండర్ల ధరలు తగ్గాయ్!
గ్యాస్ సిలెండర్ల రేటును తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. జులై 1 అంటే ఈ రోజు నుంచే తగ్గిన ధరలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఆ తగ్గిన సిలెండర్ల క్యాటగిరీ ఏంటో, ఎంత తగ్గిందో తెలుసుకుందాం రండి.
LPG Price : వినియోగదారులకు శుభవార్త. గ్యాస్ సిలెండర్ల ధరలు తగ్గాయి. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల(COMMERCIAL LPG) ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి సిలెండర్ పైగా రూ.30 తగ్గించాయి. ఈ ధరలు జులై1 సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు వెల్లడించాయి. డొమస్టిక్ గ్యాస్ సిలెండర్ల రేటులో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదని ప్రకటించాయి. తగ్గించిన ధరల ప్రకారం.. ఏఏ ప్రాంతాల్లో కమర్షియల్ సిలెండర్ ధరలు ఎలా మారాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరలు(COMMERCIAL LPG CYLINDER PRICE) వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్, మే, జూన్, జూలై మొదటి రోజునే వీటి ధరల్ని చమురు కంపెనీలు వరుసగా తగ్గిస్తూ వచ్చాయి. తగ్గిన ధరల ప్రకారం ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా ఉన్నాయి. దిల్లీలో రూ.1646, ముంబయిలో రూ.1599, కోల్కతాలో రూ.1757, చెన్నైలో రూ.1810, హైదరాబాద్లో రూ.1873గా ఉన్నాయి.
చమురు కంపెనీలు.. మనం అంతా ఇళ్లల్లో వాడుకునే డొమస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరల్ని మాత్రం తగ్గించడం లేదు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే ఇది కాస్త తక్కువకు లభిస్తోంది తప్ప మిగిలిన వారందరికీ రేటు ఎక్కువగానే ఉంది. ఎప్పటికప్పుడు ఎల్పీజీ సిలెండర్(LPG cylinder) రేట్లను తెలుసుకోవాలని అనుకునే వారు ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ని చూడవచ్చు. దీనిలో గ్యాస్, ఆటోగ్యాస్, కిరోసిన్, జెట్ ఫ్యూయల్ లాంటి వాటి రేట్లూ అప్డేటెడ్గా ఉంటాయి.