»Encephalartos Woody Is The Only Solitary Plant In The World Ai Help For Cycad Plant
Solitary plant: ప్రపంచంలోనే ఏకైక ఒంటరి మొక్క.. తోడుకోసం ఏఐ సాయం
ప్రపంచంలో ఒంటరి మొక్కను గుర్తించిన శాస్త్రవేత్తలు ఆ మొక్కను పునరుత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Encephalartos woody is the only solitary plant in the world. AI help for cycad plant
Solitary plant: ప్రపంచంలోనే ఒంటరి మొక్కను గుర్తించారు శాస్త్రవేత్తలు. దీన్ని పరిశీలించి మరో మొక్కకోసం వెతుకుతున్నారు. ఎలాగైనా ఈ మొక్కలను వ్యాప్తి చేయాలని, పునరుత్పత్తి చేసి వీటి సంఖ్యను పెంచేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మొక్కను పరిశీలించి ఇది మగ మొక్కని నిర్ధారించుకున్నారు. దీంతో ఆ మొక్కకు తోడు ఆడ మొక్కను అన్వేషిస్తున్నారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నారు. ఈ అరుదైన మొక్క పేరు ఎన్సెఫాలార్టోస్ వూడీ. ఇది సైకాడ్ జాతికి చెందినది. వీటి గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.
సైకాడ్ జాతి చెట్లు డైనోసర్ల కంటే ముందు నుంచి భూమి మీద ఉన్నాయని వారు గుర్తించారు. సౌతాఫ్రికాలోని గోయె అటవీ ప్రాంతంలో ఈ మొక్కను సైంటిస్టులు గుర్తించారు. భూమి మీద ఇలాంటి మొక్కలు ఎక్కడా ఉన్నాయో అని ఏఐ సాయం తీసుకుంటున్నారు. అంతరించి పోయే ప్రమాదం ఉన్న ఈ మొక్కను సహజ పద్దతి ద్వారా వృద్దిచేసే ఆలోచనలో ఉన్నారు. దీనికోసం 10 వేల ఎకరాల గోయే అటవీ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. మరో మొక్క కనిపిస్తే ఈ మొక్కలను బతించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.