Big shock for BRS. Pocharam Srinivas Reddy joined the Congress
Pocharam Srinivas Reddy: తెలంగాణలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. అసెంబ్లీ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. వీరితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో వీరు కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం పోచారంను కాంగ్రెస్లోకి చేరాలని ఆయన ఆహ్వానించారు. దాంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి ఇద్దరు కాంగ్రెస్లోకి చేరారు. ప్రస్తుతం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.
కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి.