Harom Hara Movie Review: హరోం హరా మూవీ రివ్యూ.. సుధీర్ బాబు హిట్ కొట్టాడా?
రిజల్ట్‌తో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు హీరో సుధీర్‌బాబు. ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నా ఆశించిన హిట్లు మాత్రం రావడం లేదు. ఈ సారి విజయమే లక్ష్యంగా సుధీర్ బాబు హీరోగా వస్తున్న తాజా చిత్రం హరోం హర. ట్రైలర్‌తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు విజయం సాధించిందో ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ కుప్పం ప్రాంతంలో 80వ ప్రాంతంలో తమ్మిరెడ్డి (లక్కీ లక్ష్మణ్), అతని తమ్ముడు బసవరెడ్డి (రవి కాలె)లు తమ గుప్పెట్లో పెట్టుకొని అనేక అకృత్యాలు చేస్తుంటారు. తాము కన్నెసిన భూమిని కబ్జా చేయడం, ఇష్టమైన మహిళలపై అత్యాచారాలకు పాల్పడటంతో ఎదురొచ్చిన వారిని చంపడం చేస్తుంటారు. వారికి భయపడి ఊరిలో చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లి బతుకుతుంటారు. అలాంటి సమయంలో కుప్పంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలోకి ల్యాబ్ అసిస్టెంట్‌గా చేరుతాడు సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు). అనుకోకుండా తమ్మిరెడ్డి గ్యాంగ్‌తో గొడవపడి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అదే సమయంలో తండ్రి శివారెడ్డి (జయప్రకాశ్) చేసిన అప్పులు సుబ్రహ్మణ్యం తీర్చాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్లకు డబ్బు సంపాదించడం కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో తన మిత్రుడు, సస్పెండ్ పోలీస్ అయిన పళని స్వామి (సునీల్)తో కలిసి తుపాకులు తయారు చేసి అమ్మాలని ప్లాన్ చేస్తారు. అనుకున్నట్లుగానే భారీగా గన్స్ తయారు చేస్తార. ఆ తరువాత ఏమైంది? ఆయుధాల వ్యాపారంలో సుబ్రహ్మణ్యం ఏస్థాయికి వెళ్లాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నదమ్ముుల భారీ నుంచి కుప్పం ప్రాంతాన్ని ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
హీరో గన్ స్మిత్ పాత్రలో కనిపించడంతో అందరికీ ఆసక్తి పెరిగింది. ఎందుకంటే ఈ తరహా పాత్ర తెలుగులో పెద్గగా రాలేదు. ఈ సినిమాలో చూపించిన యాక్షన్ హంగామా, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కలర్ టోన్ అన్నీ కొత్తదనంతో అన్ని కొత్తగా ఉన్నాయి. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే కథను నడిపించిన తీరు రోటీన్‌గా అనిపిస్తుంది. ఈ మధ్య వచ్చిన పాపులర్ చిత్రాలు అయినా పుష్ప, కేజీయఫ్, సలార్ వంటి హిట్ చిత్రాలను ఇన్ స్పైర్గా తీసుకొని ఈ కథను చూపించినట్లు ఉంది. ఈ చిత్రంలో సెంటిమెంట్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. హీరో ఫ్రెండ్ పళనిస్వామి ఇచ్చే ఎలివేషన్స్‌తో కథ మొదలవుతుంది. తమ్మిరెడ్డి అరాచకాలు, ఆకృత్యాలతో పాటు సుబ్రహ్మణ్యం పరిచయం, విలన్లతో గొడవ ఆ తరువాత జరిగే సీన్లన్ని వేగంగా చూపించాడు.
ముందు కనిపించిన వేగం ఆ తర్వాత ఉండదు. తుపాకులు చాలా ఈజీగా తయారు చేస్తాడు. పెద్దగా సంఘర్షణ ఉండదు. హీరోకు అసలు సవాళ్లు అంటూ ఉండవు. ఈజీగా డబ్బు సంపాదిస్తాడు. అలాగే లవ్ ట్రాక్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఫాదర్ సెంటిమెంట్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక సెకండ్ హాఫ్‌లో కథ సాగదీతగా ఉంటుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే:
సుధీర్‌బాబు కెరీర్లో ఇంత వరకు ఇలాంటి యాక్షన్ పాత్ర చేయలేదు. ఆ పాత్రకు తనవంతు న్యాయం చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. మాళవిక తెరపై అందంగా కనిపించాన తనకు కథ పరగా పెద్దగా ప్రాధాన్యత లేదు. సునిల్ పాత్ర బాగుంది. ఆయన నటన ఆకట్టుకుంది. విలన్లు చాలా మంది ఉన్నారు. ఇక మిగితా నటీనటులు అంతా తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక అంశాలు:
మాస్ యాక్షన్ చిత్రాలు బాగా తెరకెక్కించిన దర్షకుడు కథను కొత్తగా రాసుకోలేకపోయాడు. తెరపై మ్యాజిక్ చేయలేకపోయాడు. కుప్పం యాసలో తన రైటింగ్ బాగుంది. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ప్రధాన బలం. నేపథ్య సంగీతం బాగుంది. అలాగే అరవింద్ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
యాక్షన్ సన్నివేశాలు
సుధీర్ నటన
సినిమాటోగ్రఫి
సంగీతం