Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 12th).. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
ఈ రోజు(2024 June 12th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
తోటివారికి ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. మీమీ రంగాల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది.
వృషభం
విందులు, వినోదాల్లో పాల్గొనకపోవడం మంచింది. అనుకోని ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. ఇంటిలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఉంటాయి.
మిథునం
ఇంటి పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం మంచిది. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాలి.
కర్కాటకం
చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అప్పులు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.
సింహం
మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. కొత్తపనులకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఉన్నాయి.
కన్య
ఇంటి పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకోని ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు.
తుల
మనస్సు చంచలంగా ఉండడం వలన ఆందోళన చెందుతారు. మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కలహాలకు అవకాశం ఉంటుంది.
వృశ్చికం
ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
ధనుస్సు
కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. మనస్తాపానికి లోనౌతారు. కొత్తపనులను వాయిదా వేసుకోవాలి.
మకరం
సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన ఉన్నాయి. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. కొత్త పనలకు ప్రణాళికలు వేస్తారు.
కుంభం
కోరుకునేది కాకుండా మరొకటి నెరవేరుతుంది. అనారోగ్య బాధలు ఉన్నాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి.
మీనం
మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. మొదులుపెట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసుకుంటారు.