అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం మధ్య మాటల యుద్ధం జరిగింది. హామీలు ఇస్తారు అమలు చేయరని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ అన్నారు. దీనిపై మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ అనే సంగతి తెలిసిందే. అక్బరుద్దీన్ దూకుడుగా ఉంటారు. గతంలో పలు సందర్భాల్లో ఇలానే సభలో మాట్లాడారు. ఈ రోజు అలా మాట్లాడగా.. మంత్రి కేటీఆర్ స్పందించారు. సభ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ లేకుంటే ఏంటీ.. నలుగురు మంత్రులం ఉన్నాం కదా అన్నారు.
గత పదేళ్లుగా హామీల అమలుకు నోచుకోలేదని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. పాతబస్తీలో మెట్రో సంగతి ఏంటీ అని అడిగారు. ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఏంటీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏదైనా సమస్య గురించి కలుద్దామని అనుకుంటే..సీఎం, మంత్రులు అందుబాటులో ఉండరని చెప్పారు. ఇష్యూకి సంబంధించి మీరు చెప్పాసిని చూపిస్తే వారిని కలుస్తాం అని చెప్పారు.
అక్బర్ కామెంట్లపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదన్నారు. అక్బరుద్దీన్ బీఏసీకి రాకుండా మాట్లాడటం సరికాదన్నారు. బీఏసీకి రానీ ప్రతిపక్ష నేత.. సభలో సభ నాయకుడు లేరని అనడం సరికాదన్నారు. బీఏసీలో చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సభకు వచ్చి మున్సిపల్ సమస్యల గురించి మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. సభను నిర్వహించడం లేదని అంటున్నారు.. గత రెండేళ్లుగా కరోనా వల్ల సభ నిర్వహించని విషయం తెలియదా అని అడిగారు.
మంత్రులు అందుబాటులో లేరనడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా దాని గురించే మాట్లాడాలని కోరారు. ఏడుగురు సభ్యులు తక్కువ సమయం ఉంటుందన్నారు. ఇప్పటికే గంట మాట్లాడరని, సభ్యులను చూసి సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. తమకు 105 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ సమస్యలను పట్టించుకోవడం లేదని.. ఇతర అంశాలు చాలా ఉన్నాయని అక్బరుద్దీన్ అన్నారు. తాను సభలో మాట్లాడటం ఇదే ఫస్ట్ కాదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాట్లాడటం అని పేర్కొన్నారు. గతంలో కూడా గంట పాటు లేదంటే 40 నిమిషాల పాటు మాట్లాడానని చెప్పారు. దీనికి మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. గతంలో అక్బర్ చక్కగా మాట్లాడేవారన్నారు. ఆయనకు ఇప్పుడే ఎందుకు కోపం వస్తుందో తెలియడం లేదని చెప్పారు.