రీసెంట్గా రిలీజ్ చేసిన భైరవ బుజ్జికి ఫిదా అయిపోయారు నెటిజన్స్. ఇక సెలబ్రిటీస్ అయితే.. బుజ్జిని రైడ్ చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే.. కల్కి విలన్ ఎవరు? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.
Kalki: కల్కి ప్రమోషన్స్ కోసం బుజ్జిని పాన్ ఇండియా లెవల్లో చూపించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. కల్కిలో ప్రభాస్ పాత్రతో పాటు బుజ్జి కూడా చాలా కీలకంగా ఉండనుంది. అందుకే.. భారతదేశంలోని కొన్ని నగరాల్లో బుజ్జిని తీసుకెళ్లబోతున్నారు. అంతేకాదు.. బుజ్జితో సెల్ఫీలు తీసుకునే అవకాశాన్నికూడా కల్పించనున్నారు. త్వరలోనే బుజ్జి ప్రమోషనల్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విలన్ ఎవరు? అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. వాస్తవానికైతే.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాను కల్కిలో గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నట్టుగా ఈ మధ్య చెప్పుకొచ్చారు కమల్. దీంతో.. కల్కి అసలు విలన్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది.
అయితే.. కమల్ పాత్ర గెస్ట్ రోల్ అయినప్పటికీ.. మెయిన్ విలన్‌గా క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. కానీ హీరోయిన్ దీపిక పదుకొనే మాత్రం నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించనుందనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీపిక పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందట. ఆడియెన్స్‌కి ఈ సీక్వెన్స్ సూపర్ ట్విస్ట్ ఇస్తుందని అంటున్నారు. అయితే.. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే.. జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే.. కల్కి కథ పై ఓ క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ వరకు ఆగాల్సిందే. జూన్ ఫస్ట్ వీక్‌లో కల్కి ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ కట్ చేసే పనిలో ఉన్నాడట నాగ్ అశ్విన్. ఏదేమైనా.. కల్కి పై మాత్రం భారీ అంచనాలున్నాయి.