»Tyson Naidu This Fight Is The Highlight Of The Movie
Tyson Naidu: టైసన్ నాయుడు.. ఈ ఫైట్ సినిమాకే హైలెట్!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'టైసన్ నాయుడు'. భీమ్లా నాయక్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ అప్టేట్ ఒకటి వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఓ ఫైట్ మామూలుగా ఉండదని అంటున్నారు.
Tyson Naidu.. This fight is the highlight of the movie!
Tyson Naidu: కెరీర్ స్టార్టింగ్‌లో దూసుకుపోయిన బెల్లకొండ సాయి శ్రీనివాస్.. ఇప్పుడు మాత్రం రేసులో కాస్త వెనకబడిపోయాడు. అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయినా సాయి.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి మెప్పించాడు. చివరగా ఛత్రపతి రీమేక్‌తో హిందీలో కూడా అడుగుపెట్టాడు. ఈ సినిమా పై బెల్లంకొండ బాబు భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. ఒరిజినల్ ఛత్రపతికి డ్యామేజ్ చేసే రిజల్ట్ అందుకుంది. దీంతో.. తిరిగి ఇప్పుడు టాలీవుడ్లో టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు సాయి శ్రీనివాస్. భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
చదవండి:Rashmika Mandanna: మరోసారి రష్మికతో పోటీ పడనున్న త్రిప్తి?
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రాజస్థాన్‌లో ప్రారంభమైంది. రెండు వారాల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించనున్నారు. స్టంట్ శివా పర్యవేక్షణలో జరుగుతున్న ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను నైట్ ఎఫెకట్లో షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం సాయి శ్రీనివాస్ చాలా రిస్క్ చేస్తున్నట్టుగా సమాచారం. సెకండాఫ్‌లో వచ్చే ఈ ఫైట్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట,గోపీ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. మరి టైసన్ నాయుడుతో బాబు బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.