»A New Building To Compete With The Taj Mahal In Agra
Agra: ఆగ్రాలో తాజ్మహాల్కు పోటీగా కొత్త కట్టడం.. విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
తాజ్ మహాల్కు పోటీగా మరో నిర్మాణం ఆగ్రాలోనే నెలకొంది. ఈ 193 అడుగుల భారీ కట్టడం సందర్శకులను మంత్రముగ్దులను చేస్తుంది. దీన్ని కూడా మొత్తం పాలరాయితోనే నిర్మించడం విశేషం.
A new building to compete with the Taj Mahal in Agra.
Agra: ఆగ్రా ఈ పేరు వినగానే అందరి మదిలో తాజ్ మహాల్ మెదులుతుంది. మొగలు చక్రవర్తి సజాహాన్ 17వ శతాబ్దంలో నర్మించిన ఈ అద్భుత పాలరాతి కట్టడం ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి. అయితే ఈ నిర్మాణానికి పోటీగా మరో భారీ కట్టడాన్ని ఆగ్రలోనే నిర్మించారు. ఆగ్ర నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో 193 అడుగుల భారీ కట్టడం సందర్శకులను మంత్రముగ్దుల్ని చేస్తుంది. రాధాస్వామి పరమభక్తుడు, ఆధ్యాత్మిక గురువు పరమ్ పురుష్ పూరణ్ ధనీ స్వామీజీ మహరాజ్ పాలరాతి సమాధి అది. ఆగ్రాలోని దయాల్ బాగ్ ప్రాంతంలో సోమీబాగ్ కాలనీలో ఈ కట్టడాన్ని నిర్మించారు.
పూర్తి పాలరాయితోనే ఈ సమాధిని నిర్మించడంతో పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నిర్మాణం కోసం రాజస్థాన్లోని మక్రానా, జోధ్ పూర్ నుంచి తెప్పించిన పాలరాయిని ఉపయోగించారు. అయితే దీని నిర్మాణం 1904లోనే చేపట్టారు. ఆ తరువాత కొన్ని వివాదాలు తలెత్తి కొంత కాలం కట్టడం ఆపేశారు. తరువాత 1922 నుంచి తిరిగి ప్రారంభించారు. అలా నిర్మిస్తూ తాజాగా మొత్తం పూర్తి చేశారు. ఇంకా తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నిర్మాణంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 31.4 అడుగుల ఎత్తైన, గుండ్రటి బంగారు పూత గుమ్మటం. ఇది తాజ్ మహల్ గుమ్మటంకన్నా పెద్దదని తెలుస్తుంది. యూపీ, పంజాబ్, కర్ణాటక అంతే కాకుండా విదేశాల్లో కూడా లక్షలాది మంది రాధాస్వామి ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరిస్తున్నారు.
చదవండి:kangana : సినిమా కంటే ఎన్నికల ప్రచారమే కష్టం – కంగనా రనౌత్