»Nagababu Nagababu Who Deactivated His Twitter Account Is That The Reason
Nagababu: ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేసిన నాగబాబు.. కారణం అదేనా?
మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మధ్య ఒక చిచ్చు మొదలయ్యింది. దీంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేశారు.
Nagababu: Nagababu who deactivated his Twitter account.. Is that the reason?
Nagababu: మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మధ్య ఒక చిచ్చు మొదలయ్యింది. అల్లు అర్జున్ స్నేహితుడు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అతనికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. తన మేనమామ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు.
పవన్‌కి మద్దతుగా వరుణ్ తేజ్, రామ్ చరణ్ అందరూ పిఠాపురం వెళ్లారు. కానీ అల్లు అర్జున్ మాత్రం మద్దతు ఇస్తున్న అని సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. దీంతో అల్లు అర్జున్‌పై పవర్ ఫ్యాన్స్‌తో అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు. అయితే తన స్నేహితుడుకి మాట ఇచ్చినందుకే నంద్యాల వెళ్లానని అల్లు అర్జున్ మీడియాకి తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్నికలు పూర్తయిన తర్వాత నాగాబాబు సోషల్ మీడియాలో ఓ సంచలన ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయిన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మా వాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారో క్లారిటీ లేదు. అల్లు అర్జున్నే ఉద్దేశించి అన్నారని నెటిజన్లు కామెంట్ చేశారు.
బన్ని తన మేనమామకి సపోర్ట్‌కి వెళ్లకుండా స్నేహితుడుకి కోసం వెళ్లారని కొందరు నెటిజన్లు తప్పుబట్టారు. కానీ బన్ని ఫ్యాన్స్ కొందరు నాగబాబును టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేశారు. దీనికి బన్ని కూడా రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. అల్లు రామలింగయ్య లేకపోతే నాగబాబు పంచర్లు వేసుకునేవాడంటూ.. బన్ని రిప్లై ఇచ్చారని న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్ట్ అల్లు అర్జున్ పెట్టలేదని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా నాగబాబు తాజాగా తన ట్విట్టర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేశారు. బన్ని పోస్ట్ కారణంగానే ట్విట్టర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేశారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.