»Avantika Vandanapu Telugu Beauty On Cover Page Of Hollywood Magazine
Avantika Vandanapu: హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై తెలుగు బ్యూటీ
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి చాలా తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది అవంతిక వందనపు. తెలుగు సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. అయితే హాలీవుడ్ మ్యాగజైన్లో కనిపించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Avantika Vandanapu: Telugu beauty on cover page of Hollywood magazine
Avantika Vandanapu: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి చాలా తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది అవంతిక వందనపు. తెలుగు సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాల్లో గ్లామరస్ పాత్రలో కనిపిస్తోంది. అయితే ఆమె మాటలకు కొన్ని విమర్శలు కూడా చేశారు. అయితే అమెరికాలోని కాలిఫోర్నియాలో పుట్టిన అవంతికి హైదరాబాద్ అమ్మాయి. కేవలం ఆమె యాక్టర్ మాత్రమే కాదు.. క్లాసికల్ డ్యాన్సర్, సింగర్, మోడల్, యాక్టర్, ఆర్టిస్టు కూడా. 10 ఏళ్ల వయసులో నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చింది.
ఇక్కడ బాల నటిగా అలరించి అమెరికా వెళ్లిపోయింది. అక్కడ చదువుకుంటూ హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. 2021లో డిస్నీ ఛానెల్ రూపొందించిన స్పిన్, మ్యాక్సీ, సీనియర్ ఇయర్, మీన్ గర్ల్స్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆమె ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది. మీన్ గర్ల్స్ కొనసాగింపుగా వచ్చిన ‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై’ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ సందర్భంగా ఆమె అమెరికన్ యాన్సియెంట్పై కొంతమంది విమర్శలు, ట్రోలింగ్ కూడా చేశారు. అయితే విమర్శకులకు తన నటనతో సమాధానం చెప్పింది.
మీగ్ గర్ల్స్ చిత్రంతో ఆమె నటనకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై అవంతిక కనిపించింది. ఈ మ్యాగజైన్లో వైట్ అండ్ సిల్వర్ డ్రస్సులో సాగర కన్యలా కనిపించింది. అలాగూ గ్రే కలర్ హెయిర్, డ్రస్సులో కూడా హాట్ లుక్స్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.