»Salaar Movie Child Artist Farzana Exclusive Interview Salaar Prabhas Prashanthneel
Salaar: ఆ ఫైట్ సలార్ మొత్తాన్ని మార్చేసింది
సలార్ చిత్రంలో కాటేరమ్మ అమ్మవారి దగ్గర ఫైట్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో సినిమా చూసిన వారికి తెలుసు. ఆ ఫైట్ జరగడానికి ముఖ్య కారణం సురభి అనే ఒక అమ్మాయి. ఆ క్యారెక్టర్ చేసిన ఫర్జానా ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
Salaar Movie Child Artist Farzana Exclusive Interview Salaar Prabhas Prashanthneel
Salaar: చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేసినట్లు, ఎన్నో యాడ్స్‌లో నటించినట్లు చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా(Farzana) పేర్కొన్నారు. తాను ఆడిషన్ ఇచ్చినప్పుడు సలార్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలియదని, ఆడిషన్ అయిపోగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సెలెక్ట్ అని చెప్పాడని తెలిపారు. కాటేరమ్మ ఏంట్రీ సీన్లో ఏం జరిగిందో ఎంతో ఆసక్తిగా వివరించారు. తాను ప్రభాస్(Prabhas) ఫ్యాన్ అని, ఆయన సెట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని వివరించారు. సలార్ చిత్రానికి తాను ఒక సంవత్సరం పనిచేసినట్లు వెల్లడించారు. ఇక ప్రభాస్‌కు చాలా హెల్పింగ్ నేచర్ అని, ఎవరికి ఏం కావాలన్నా ఇస్తారు అని ఫర్జానా చెప్పారు. సలార్ సెట్ చాలా పెద్దది అని, అక్కడే ఒక సంవత్సరం ఎలా గడిచిపోయిందో తెలియలేదని వెల్లడించారు. అయితే సెట్లో స్మోక్ ఎక్కువగా వాడారని, షూటింగ్ సమయంలో ఇబ్బంది పడలేదన్నారు. అలాగే పృథ్వీ రాజ్ సుకుమార్‌తో కూడా చాలా ఫన్నీ విషయాలు ఉన్నాయని చెప్పారు. ఫర్జానా చెప్పిన సలార్ విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.