Everest: Nepal has imposed a ban on Everest spices!
Everest: భారత్‌కు చెందిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాల కంపెనీలను నేపాల్ బ్యాన్ విధించింది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ బ్యాన్ విధించగా.. తాజాగా నేపాల్ కూడా బ్యాన్ విధించింది. ఈ రెండు సంస్థలకు చెందిన మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు. ఈ మసాలల్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని నేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కంపెనీలకు చెందిన మసాలాల్లో ఇథలిన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. ఎవరెస్టు మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది.
ఎండీహెచ్ సాంబార్ మసాలాలో కూడా క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలింది. దీంతో పలు దేశాలు ఈ రెండు ప్రొడక్ట్స్‌పై నిషేధం విధించాయి. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సైతం ఈ రెండు మసాలాలపై విచారణ జరుపుతున్నాయి. ఆస్ట్రేలియా మార్కెట్ నుంచి ఆయా కంపెనీల మసాలాలను రీకాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. విదేశాల్లో నిషేధానికి గురైన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలు భారత్‌లో కూడా విక్రయిస్తుండటంతో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ కంపెనీలకు చెందిన మసాలాలను సేకరించి ప్రయోగశాలలో నమూనాలను పరీక్షిస్తున్నట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి తెలిపారు.