»Kalki 2898ad Election Effect They All Left From Kalki
Kalki 2898AD: ఎన్నికల ఎఫెక్ట్.. ‘కల్కి’ నుంచి వారంతా వెళ్లిపోయారు?
ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898ఏడి మూవీ పై మరోసారి ఎన్నికల ఎఫెక్ట్ పడింది. దీంతో.. వారంతా వెళ్లిపోయారు అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Kalki 2898Ad: Election effect.. They all left from 'Kalki'?
Kalki 2898Ad: ఎన్నికల షెడ్యూల్ కారణంగా కల్కి 2898ఏడి మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మే 9న రావాల్సిన కల్కి.. మే 13న ఎన్నికలు ఉండడంతో.. జూన్ 27కి పోస్ట్ పోన్ అయింది. ఎట్టి పరిస్థితుల్లోను ఈసారి కల్కి 2898ఏడి మూవీని రిలీజ్ చేసి తీరుతామని చెబుతున్నారు మేకర్స్. అయితే.. తాజాగా మరోసారి కల్కి సినిమా పై ఎన్నికల ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు నాగ్ అశ్విన్. వీలైనంత త్వరగా గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. కానీ సీజీ వర్క్ చేస్తున్న వారంతా ఓట్లు వేయడానికి వెళ్లిపోవడంతో.. కాస్త డిలే అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేశారు మేకర్స్.
తాజాగా కల్కి నిర్మాత స్వప్న దత్ తన ఇన్‌స్టా స్టోరీలో నాగ్ అశ్విన్‌తో ఉన్న ఫొటో ఒకటి షేర్ చేసింది. ఈ సందర్భంగా.. తమ మధ్య జరిగిన సంభాషణని కాస్త ఫన్‌గా రాసుకొచ్చింది. మన సినిమాకి సీజీ వర్క్ చేస్తున్న వారంతా హైదరాబాద్ నుంచి ఎలక్షన్స్‌కి వెళ్లిపోయారు.. అని నాగ్ అశ్విన్ అంటే, మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అని అడిగింది స్వప్న. దీనికి నాగ్ అశ్విన్.. ఎవరు గెలిస్తే నాకెందుకండి, నా సీజీ షాట్స్ ఎప్పుడు వస్తాయో నాకు కావలి కానీ.. అన్నట్టుగా పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో.. ఎన్నికల ఎఫెక్ట్ కల్కి మీద కాస్త గట్టిగానే ఉందని చెప్పాలి. ఎన్నికల కారణంగా మూడు, నాలుగు రోజులు సీజి వర్క్ ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. గ్రాఫిక్ వర్క్ ఇంకా చాలా పెండింగ్‌లో ఉందని, వీలైనంత త్వరగా పూర్తిచేయాలని శ్రమిస్తోంది చిత్ర యూనిట్. ఆ తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి కల్కి సీజి వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి.