యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ ఫాలోయింగ్‌లో ఎన్టీఆర్ తర్వాతే ఎవ్వరైనా. కానీ హిందీలో యంగ్ టైగర్ క్రేజ్ చూస్తే షాక్ అవాల్సిందే. ఒక్క సినిమా కూడా చేయకుండానే ఇలా ఉంటే..?
NTR: ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు టాలీవుడ్‌కే పరిమితమైన ఎన్టీఆర్.. ఇప్పుడు పాన్ ఇండియా లవెల్లో దుమ్ముదులపడానికి రెడీ అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ క్రేజ్‌తో భారీ సినిమాలు చేస్తున్నాడు. కొరటాల శివతో దేవర సినిమాను రెండు భాగాలుగా చేస్తున్నాడు. అలాగే.. మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ వార్2తో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు టైగర్. ఇప్పటికే షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ముంబైలో ఎన్టీఆర్‌కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ప్రజెంట్ ముంబైలోనే ఉన్నాడు ఎన్టీఆర్. దీంతో.. అక్కడ స్టార్ హీరోలతో రచ్చ చేస్తున్నాడు.
అసలు ముంబైలో ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. హైదరాబాద్‌లో నైటౌట్లు, పార్టీలకు దూరంగా ఉండే ఎన్టీఆర్.. ముంబైలో ఇలాంటివి కామన్ కాబట్టి.. అక్కడ అదే ఫాలో అవుతున్నాడు. లేటెస్ట్గా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, హృతిక్ రోషన్‌తో కలిసి తన భార్య ప్రణతితో డిన్నర్‌కు వెళ్లాడు ఎన్టీఆర్. అక్కడ.. టైగర్ ఎంట్రీ ఇవ్వడమే లేట్ అన్నట్టుగా ఫోటోల కోసం ఎగబడ్డారు అభిమానులు.
ఓ లేడీ అభిమాని తన బర్త్ డే అని చెప్పడంతో.. ఆమెకి బర్త్ డే విష్ చేసి ఫోటో కూడా డిగాడు ఎన్టీఆర్. డిన్నర్‌కి వెళ్లేటప్పుడు ఎలా అయితే వెళ్లాడో.. తిరిగొచ్చేటప్పుడు కూడా అదే క్రౌడ్ మధ్య నుంచి బయటికెళ్లాడు ఎన్టీఆర్. అసలు.. ఒక్క హిందీ సినిమా చేయకుండానే టైగర్‌కు నార్త్‌లో ఈ క్రేజ్ ఉంటే.. ఇక వార్ 2 రిలీజ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా ఫ్యూచర్లో బాలీవుడ్ హీరోలను డామినేట్ చేయడం గ్యారెంటీ.. అని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.