తమిళ స్టార్ హీరో విజయ్ మరో సినిమాను ప్రారంభించాడు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్ సినిమా చేసిన తర్వాత లోకేశ్ కనగరాజ్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. విజయ్ తో తన సినిమాను అనౌన్స్ చేసిన కొద్ది రోజుల్లోనే పూజా కార్యక్రమాలు కూడా చేశారు. గతంలో లోకేశ్, విజయ్ కాంబోలో మాస్టర్ అనే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. దీంతో వీరి కాంబోలో వస్తోన్న మరో సినిమా కావడంతో సినీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే దీనికి సంబంధించి టైటిల్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు. దళపతి 67 వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా టైటిల్ ను ఫిబ్రవరి 3వ తేదిన ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష కథానాయికగా చేస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.