»Shock For Ycp Senior Leader Dokka Manikyam Varaprasad Resigns
Dokka Manikyam Varaprasad: వైసీపీకి షాక్.. సీనియర్ నేత డొక్కా మాణిక్యం రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీకి చెందిన సీనియర్ నేత డొక్కా మాణిక్యం వరప్రసాద్ పార్టీని వీడారు. గుంటూరు జిల్లా అధ్యక్షపదవికి కూడా రాజీనామా చేశారు.
Shock for YCP. Senior leader Dokka Manikyam Varaprasad resigns
Dokka Manikyam Varaprasad: సార్వత్రిక ఎన్నిలక వేళా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(ap elections) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్(CM YS Jagan)కు భారీ షాక్ తగిలింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్యం వరప్రసాద్( Dokka Manikyam Varaprasa) రాజీనామా చేశారు. గుంటూరు జిల్లాకు ఆయన వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేస్తూ ఆ లేఖను సీఎం జగన్‌కు పంపారు. డొక్కా మాణిక్యం తాటికొండ టికెట్‌ను ఆశించారు. కానీ ఆ స్థానంలో మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైసీపీ టికెట్ కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో మాణిక్యం గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు.
గతంలో ఆయన టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. గతంలో టీడీపీలో ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన 2022లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయకు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. గత కొంత కాలంగా పార్టీ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న డొక్కా మాణిక్యం శుక్రవారం పార్టీని వీడారు. మళ్లీ టీడీపీలో చేరే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల సమాచారం.