The student who scored 599 marks out of 600 is the first rank in the state
State First Rank: ఏపీ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఓ అమ్మాయికి ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయి. నిర్ణిత మార్కులకు ఒకే ఒక్క మార్కు తక్కువ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విద్యార్థినికి 600 కు 599 మార్కులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. మొత్తం ఆరు సబ్జెక్టులు అందులో హిందీ సెకండ్ ల్యాంగేజ్ మినహా అన్ని సబ్జెక్టులలో 100కు 100 మార్కులు సాధించింది. హిందీలో మాత్రం 99 మార్కులు వచ్చాయి. మనస్వి ఈ 2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు ఎస్సెస్సీ బోర్డు తెలిపింది. ఈ ఫలితాల్లో ఏపీ రాష్ట్రంలో బాలురు 84.02 శాతం, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే బాలికలు 4.98 శాతం అధికంగా పాస్ పర్సెంటేజ్ పొందారు.