ప్రపంచంలోనే ‘మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్’ 100 మంది జాబితాను టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్ తో సహా ఇంకా ఎవరెవరు స్థానం సంపాదించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Time’s 100 most influential people list : ప్రపంచంలోనే అత్యంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లిస్ట్‌ని టైమ్స్ మ్యాగజైన్ బుధవారం విడుదల చేసింది. టైమ్స్ 100(Time’s 100) పేరుతో విడుదల చేసిన ఆ జాబితాలో భారత దేశం నుంచి బాలీవుడ్ నటి అలియా భట్(Alia Bhatt), మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్‌పాల్ సింగ్ బంగాలు స్థానం సంపాదించుకున్నారు. అలాగే భారత రెజ్లర్ సాక్షి మాలిక్ సైతం చోటు దక్కించుకున్నారు.
టైమ్స్ ఇన్ల్ఫుయెన్షియల్ పీపుల్ (TIMES INFLUENTIAL PEOPLE ) జాబితాలో ఇంకా యేల్ యూనివర్సిటీలో ఫిజిక్స్, జియాలజీ ప్రొఫెసర్‌గా ఉన్న ప్రియంవదా నటరాజన్, అమెరికా ఇంధన శాఖలో రుణ కార్యక్రమాల ఆఫీస్ డైరెక్టర్ జిగర్ షా మొదలైన వారు ఉన్నారు. వీరితో పాటుగా భారత సంతతికి చెందిన రెస్టారెంటు యజమాని అస్మా ఖాన్, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావాల్నీ భార్య యులియా తదితరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న సత్య నాదెళ్ల గురించి టైమ్స్(Time’s) మ్యాగజైన్ ప్రముఖంగా ప్రస్తావించింది. ఆయన భవిష్యత్తును తీర్చి దిద్దడంలో ఎంతో ప్రభావవంతంగా పని చేశారని కొనియాడింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేదింపుల విషయమై పోరాటం చేసినందుకు గాను భారతీయ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్‌కు ఈ గౌరవం లభించింది.