»Ayodhya Ram Mandir Seen The Wonder Surya Tilak For Ayodhya Bala Rama
Ayodhya Ram Mandhir: అద్భుత దృశ్యం చూశారా? అయోధ్య బాలరాముడికి సూర్యతిలకం
శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో నవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. అయితే ఈ రోజు ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం కనిపించింది.
Ayodhya Ram Mandir: Seen the wonder? Surya Tilak for Ayodhya Bala Rama
Ayodhya Ram Mandhir: శ్రీరామ నవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంలో వేడుకలు ఘనంగా చేశారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో నవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. అయితే ఈ రోజు ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం కనిపించింది. ఈ తిలకం కనిపించడంతో భక్తజనం పరవశించిపోయారు. గర్భగుడిలో రాముడి విగ్రహం నుదిటిపై తిలకం వలే సూర్యకిరణాలు కనిపించాయి. వీటిని అధునాతన సాంకేతికత సాయంతో 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించేలా చేశారు.
మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కన్పించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్తవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ సంస్థ శాస్త్రవేత్తలు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి శ్రీరామ నవమి రోజున రాముడి విగ్రహంపై ఈతిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు.
ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి. వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా? అనే సందేహం ఉంటుంది. అయితే దీనికోసం గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానంతో గేర్ టీత్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. అలా నవమిరోజు అనుకున్న చోటుకు వస్తుంది. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలి.