హీరో, హీరోయిన్ల గురించి వచ్చే పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చాక ఎలాంటి న్యూస్ అయిన సరే క్షణాల్లో వైరల్‌గా మారుతుంటుంది. లేటెస్ట్గా అనుష్క ఓ హీరోతో ఎఫైర్ అనేది హాట్ టాపిక్‌గా మారింది.
Anushka Shetty: మామూలుగా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు కలిసి నటిస్తే చాలు.. ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందనే పుకారు మొదలవుతుంది. అది కాస్త వైరల్‌గా మారి ఇద్దరు ప్రేమలో ఉన్నారు.. ఇద్దరి మధ్య ఎఫైర్ అంటూ చెవులు కొరుక్కుంటారు. చాలా రోజులుగా ప్రభాస్, అనుష్క లవ్‌లో ఉన్నారని.. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వస్తునే ఉన్నాయి. మొదటిసారి బిల్లా సినిమాలో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క.. ఆ తర్వాత బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.. అంటూ వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.. ఈ వార్తలన్నీ కేవలం పుకార్లుగానే ఉన్నాయి.
ప్రభాస్, అనుష్క్ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఆ వార్తలను కొట్టిపారేశారు. అయితే.. ప్రస్తుతం అనుష్క పూర్తిగా సినిమాలు తగ్గించింది. చివరగా నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ మళయాళంతో పాటు తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ఫ్రెండ్ అంటే అందరికీ గుర్తొచ్చేది హీరో గోపిచంద్నే. అయితే.. గోపిచంద్‌తో అనుష్క సీక్రెట్ రిలేషన్షిప్ మెంటైన్ చేస్తున్నట్టుగా కొందరు ప్రచారం చేస్తున్నారు.
వీరిద్దరు కలిసి గతంలో లక్ష్యం, శౌర్యం సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏదో నడిచిందని.. చాలారోజులు వీరి మధ్య ఎఫైర్ నడించిందని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ అసలు ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదనేది వాస్తవం అంటున్నారు. అయినా ఎప్పుడో కలిసి నటిస్తే.. ఇప్పుడెందుకు ఇలాంటి వార్తలు రాస్తున్నారనేది అర్థం కానీ విషయమే.. అని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. అన్నట్టు.. గతంలో అనుష్క, నాగార్జున మధ్య కూడా ఎఫైర్ ఉందని కథనాలు వెలువడ్డాయి.