ఈసారి పుష్పగాడి బాక్సాఫీస్ వేట మామూలుగా ఉండదని.. వేర్ ఈజ్ పుష్ప వీడియోతో ఎప్పుడో చెప్పేశాడు సుకుమార్. ఇక ఇప్పుడు వెయ్యి కోట్లు టార్గెట్‌గా పుష్ప2 టీజర్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ టీజర్ చూసి అంతా ఫిదా అవుతున్నారు.
Pushpa 2: వారం రోజుల క్రితమే పుష్ప2 టీజర్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్.. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్‌గా టీజర్ రిలీజ్ చేశారు. బన్నీకి బర్త్ డే విష్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్.. చూస్తే అల్లు ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోవడం గ్యారెంటీ. ఒక్కో షాట్ గూస్ బంప్స్ వచ్చేలా.. జాతర సెటప్‌లో హై ఓల్టేజ్ కట్స్‌తో టీజర్ కట్ చేశారు. పుష్పగాడు చేయబోయే మాస్ జాతర ఎలా ఉంటుందో.. ఈ టీజర్‌ను జస్ట్ ఓ శాంపిల్‌గా చూపించారు. మామూలుగానే ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్ పుష్పరాజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తెలుగులో కంటే.. నార్త్‌లోనే పుష్ప పార్ట్ 1 సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే.. పుష్ప 2.. ది రూల్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక ఇప్పుడు ఆ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లేలా పుష్ప2 టీజర్ ఉంది. ఫుల్ జాతర గెటప్, జాతర సీన్లు, జాతర యాక్షన్‌తో మాస్ జాతర మామూలుగా ఉండదని చెప్పేశాడు సుకుమార్.
ముఖ్యంగా బన్నీ అమ్మవారి గెటప్ చూస్తే.. అమ్మోరు పూనినట్టుంది. కాలి గజ్జే, కంటికి కాటుక, ఆ కట్టు, బొట్టు, ఆ సెటప్.. పీక్స్ అంతే. థియేటర్లో ఈ గంగమ్మ జాతర సీన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా థియేటర్లు తగలబడిపోవడం గ్యారెంటీ. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మొత్తంగా.. పుష్ప2 టీజర్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా పుష్ప2 టీజర్‌పై స్పందించింది. ‘హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ సార్. పుష్ప 2 టీజర్ అద్భుతంగా ఉంది. చెప్పడానికి పదాలు లేవు. సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా.. అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. గతంలో.. అల్లు అర్జున్, శ్రీలీల ‘ఆహా ఒరిజినల్’ యాడ్‌లో అలా మెరిశారు. ఇక పుష్ప 2 టీజర్ పై అనసూయ కూడా స్పందించింది. ‘సార్.. ఏంటిది? ఆహా ఏంటిది అంట? అలా కాలు తిప్పి.. టైమింగ్‌లో కొంగు పట్టి దూపి.. విదిలించి.. నడుస్తుంటే సార్.. అని అనసూయ ట్వీట్ చేసింది. ఓవరాల్‌గా యూనానిమస్‌గా పుష్ప2 టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.