car driving : రాత్రి పూట డ్రైవింగ్ సేఫ్ గా చేయాలంటే ఇవిగో టిప్స్
పగటి పూట డ్రైవింగ్ కంటే రాత్రి పూట డ్రైవింగ్ కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. మీరు గనుక కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని రాత్రి పూట డ్రైవ్ చేయాలనుకుంటున్నట్లైతే కొన్ని టిప్స్ ఇక్కడున్నాయి. చదివేయండి.
car driving In Night Time : రాత్రి పూట డ్రైవింగ్ సక్రమంగా, భద్రంగా చేయగలిగినప్పుడే మన డ్రైవింగ్ సత్తా ఏంటో తెలుస్తుంది. కొత్త వారికి నైట్ కార్ డ్రైవింగ్(Night car driving) కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే లైటింగ్లు, రోడ్ సూచికలు, రోడ్ మార్జిన్లు, ట్రాఫిక్ వీటన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటూ కార్ని డ్రైవ్ చేయడం అంటే అంత తేలికైన పని కాదు. కొన్ని గణాంకాల్ని బట్టి చూస్తే రోడ్డు ప్రమాదాలు పగలు కంటే రాత్రిళ్లే ఎక్కువగా అవుతాయట. అందుకనే ఈ టైంలో డ్రైవింగ్ చేసేప్పుడు కొన్ని విషయాల్ని కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి.
రాత్రిపూట డ్రైవింగ్ చేసేప్పుడు ఓవర్ స్పీడ్‌లో ఎప్పుడూ వెళ్లకూడదు. ఎందుకంటే ఎదురుగా వెళుతున్న వాహనాలు ఎంత స్పీడ్‌లో వెళుతున్నాయి? అనేది ఆ సమయంలో అంచనా వేయడం కాస్త కష్టంగా ఉంటుంది. అందుకనే రాత్రిళ్లు అతి వేగం పనికి రాదని గుర్తుంచుకోవాలి. రాత్రి డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు ముందుగానే కారులోని హెడ్లైట్లు, టైల్ లైట్లు, ఇండికేటర్లు వంటివి సరిగ్గా పని చేస్తున్నాయో లేదో ముందే చెక్ చేసుకోవాలి. అవి రాత్రి సమయంలో అధిక కాంతిని ప్రసరించేలా చూసుకోవాలి. ఇంకా.. వాటిపై దుమ్ము దూళి లేకుండా తుడుచుకోవాలి.
నైట్ డ్రైవింగ్ చేసే వారు కనీసం రెండు గంటలకు ఒకసారి కచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. టీ, కాఫీల్లాంటివి తాగాలి. అలాగే కారు అద్దాలను ఎప్పుడూ క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. స్మోకింగ్ చేయడం, మద్యం తాగడం లాంటివి చేసి అస్సలు డ్రైవింగ్ చేయకండి. మద్యం వల్లే కాదు సిగరెట్లో ఉండే నికోటిన్ వల్ల కంటి చూపుపై చాలా ప్రభావం ఉంటుంది. కాస్త మసకబారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రహదారిపై రాత్రివేళ కారు ఆపితే.. లైట్లను పూర్తిగా ఆఫ్ చేయకండి. హెడ్లైట్లు, ఇండికేటర్లు కచ్చితంగా ఆన్‌లో ఉండాలి.