Neelayapalem Vijay Kumar: ఓటు వేసేముందు యువత బాగా ఆలోచించి వేయాలని టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ కోరారు. ఉద్యోగాలు కావాలంటే ఈసారి చంద్రబాబు రావాలన్నారు. యువతకు ఉద్యోగాలిస్తే తల్లిదండ్రుల కలలు ఫలిస్తాయని తెలిపారు. పరిశ్రమలు, ఉద్యోగాలు సృష్టించిన ప్రభుత్వమేదో తెలుసుకోవాలన్నారు. వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించిందెవరో చూడాలని తెలిపారు. 2014-2019 కాలంలో వచ్చినన్ని పరిశ్రమలు ఏపీలో 60 ఏళ్లలో రాలేదు. ఈ సమయంలో కియా, హీరో వంటి అనేక కంపెనీలు వచ్చాయి.
2019 వరకు వివిధ స్థాయుల్లో 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆర్థికంగా, సంక్షేమపరంగా చంద్రబాబు ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు. దేశ విదేశాల్లోని పారిశ్రామికవేత్తలతో స్వయంగా చంద్రబాబు చర్చించి కంపెనీలు తెచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనతో వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలొచ్చాయి. వైసీపీ పాలనలో కంపెనీలు రాకపోగా ఉన్నవి పోయాయి. పెట్టుబడి పెట్టాలని వచ్చిన వాళ్లను లంచాలు కావాలని బెదిరించారు. దీంతో వాళ్లు వెళ్లిపోయారన్నారు. ఉద్యోగాలు లేక యువత, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని విజయ్ కుమార్ అన్నారు.