మాసబ్ ట్యాంక్ లోని మత్స్య శాఖ కార్యాలయంలో నూతన ఫిష్ క్యాంటీన్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేపలు, రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. గడిచిన ఈ ఎనిమిది ఏండ్లలో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని పేర్కోన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. అన్ని నీటి వనరులలో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు.. అలాగే మత్స్య కారుల సంక్షేమం కోసం మార్కెటింగ్ కు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయని.. మత్స్య కారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని తలసాని అన్నారు.