Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో అసుదుద్దీన్ ఒవైసీ ఆదివారం అప్నా దళ్ (కామెరవాడి)తో పొత్తు కుదుర్చుకున్నారు. ఈ రెండు పార్టీల కూటమి ప్రకటనకు ముందు అప్నాదళ్ (కె) నాయకురాలు పల్లవి పటేల్ మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలిశారు. ఆదివారం లక్నోలో పల్లవి పటేల్, అసదుద్దీన్ ఒవైసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించారు. వారు కూటమికి కొత్త నినాదాన్ని ఇచ్చారు. మార్చి 23న అప్నా దళ్ (కె) ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్పూర్, మీర్జాపూర్, కౌశాంబి లాంటి మూడు లోక్‌సభ స్థానాల నుండి తమ అభ్యర్థులను ఉపసంహరించుకుంది.
తదుపరి నోటీసు వచ్చేవరకు లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను రద్దు చేసినట్లు కృష్ణ పటేల్ నేతృత్వంలోని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ తెలిపింది. అప్నా దళ్ (కె) 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పి)తో పొత్తుతో పోటీ చేసింది. పటేల్ ఎస్పి టిక్కెట్‌పై పోటీ చేశారు. ఎస్పీతో పొత్తు తెంచుకున్న తర్వాత పల్లవి పటేల్ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని 2017లో 47 మంది ఎస్పీ ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పారు.
అట్టడుగున ఉన్న దళిత ముస్లిం సమాజాంపై ప్రభుత్వ వైఖరిపై అప్నాదళ్(కే) నాయకురాలు పల్లవి పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయని ఆరోపించారు. పీడీఎం ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ ఉద్యమంతో ముందుకు వచ్చిందని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోక్‌సభ స్థానాల్లో అరంగ్రేటం చేయడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 జరిగే 7 దశల ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని 80 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.