NRML: నిర్మల్లోని ఇస్లాంపుర కమల్ పౌష్ మసీద్ కమిటీ బుధవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో శ్రీహరి రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మసీద్ సమస్యలను పరిష్కరించాలని అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందుకు డీసీసీ అధ్యక్షులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మసీద్ కమిటీ అధ్యక్షులు మినాజ్, సభ్యులు పాల్గొన్నారు.