ప్రకాశం: కనిగిరిలో రిటైర్డ్ ఎమ్మార్వో చీదర్ల సభాపతిరావు అనారోగ్య కారణంగా బుధవారం తన స్వగృహంలో మృతి చెందారు. ఆయన మృతదేహానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఎమ్మార్వో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాదరహితుడుగా సభాపతిరావు పేరు సంపాదించుకున్నారన్నారు.