ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
KCR Orders BRS subsidiary Union Not Contest In Singareni Elections
KCR : ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం నేరుగా రైతుల వద్దకు వెళ్లి మీ వెంట మేముంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ రేపు సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో కేసీఆర్ జిల్లాల పర్యటనకు బయలుదేరుతారు. తొలుత జనగామ జిల్లా ధరావత్ తండాకు ఉదయం 10:30 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. ఉదయం 11:30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం అర్వపల్లి మండలం సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయలుదేరి 1:30 గంటలకు సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేస్తారు. 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి నల్లగొండ జిల్లాకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 4:30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిన పంటలను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి ఎర్రవెల్లికి బయల్దేరి వెళ్తారు. కేసీఆర్ రోడ్డు మార్గంలో ప్రయాణించి రాత్రి 7 గంటలకు ఎర్రవెల్లి చేరుకుంటారు.