CP Radhakrishnan appointed as governor : తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధా కృష్ణన్(CP Radhakrishnan) అపాయింట్ అయ్యారు. ఇప్పటికే ఝార్ఖండ్ గవర్నర్‌గా పని చేస్తున్న ఆయన తెలంగాణ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం.. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ నియామకం జరిగేంత వరకు సీపీ రాధా కృష్ణన్ గవర్నర్‌గా కొనసాగుతారు.
తమిళనాడుకు చెందిన సీపీ రాధా కృష్ణన్ ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్‌గా ఉన్నారు. 1998, 99 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేశారు. కోయంబత్తూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం కావడానికి కృషి చేశారు. దీంతో గత ఏడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా( governor) అదనపు బాధ్యతలు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణకు(Telangana) ఇప్పటి వరకు గవర్నర్‌గా పని చేసిన తమిళసై సౌందర్య రాజన్(Tamilisai Soundararajan) సోమవారం ఉన్నట్లుండి తన రాజీనామాను ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశంతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నై సెంట్రల్ లేదా తుత్తూకూడి నుంచి ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలున్నాయని సమాచారం.