Loksabha Elections 2024: ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మే 13న ఏపీలో ఎన్నికలు
తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన.
Loksabha Elections 2024: లోక్ సభ ఎన్నికల(Loksabha Elections 2024 )తో పాటు 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. విజ్ఞాన్‌భవన్ ప్లీనరీ హాల్లో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొదటగా 26 అసంబ్లీ స్థానాల్లో బై ఎలక్షన్స్ నిర్వహిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 4న కౌంటింగ్. ఎప్రిల్ 25 న నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుందని ఈసీ తెలిపింది.
ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనుంది. దేశంలో మొత్తం 97 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో 49.7 కోట్ల మంది పరుషులు, 47.1 మహిళ ఓటర్లు, 48 వేల ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కోటి 82 లక్షల కొత్త ఓటర్లు ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరుగుతున్నట్లు ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. ఎన్నికల వీధుల్లో 1.5 కోట్ల మంది పని చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎమ్‌లు రెడీ చేశామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లు ఉండకూడదు. కులం, మతం పేరుతో ఓట్లతో అడగొద్దు అని ఈసీ స్పష్టం చేశారు.