»These Are My Last Elections I Dont Even Want To Be A Minister Kodali Nani
Kodali Nani: రిటైర్మెంట్ వయసొచ్చింది.. ఇవే నా చివరి ఎన్నికలు
మంత్రి పదవిపై ఆశలేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. రిటైర్మెంట్ వయసొచ్చిందని, 2029లో తాను పోటీ చేయనని పేర్కొన్నారు. ఇవే తన చివరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాటలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
These are my last elections.. I don't even want to be a minister Kodali Nani
Kodali Nani: గుడివాడ వైసీపీ(YCP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరగనున్న ఎన్నికలే తన చివరివని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తనకు వయసు అయిపోతోందన్నారు. తన వయసు 52 ఏళ్లని, రిటైర్మెంట్ వయసు వచ్చిందని ఈ ఒక్క పర్యాయం ప్రజలకు సేవ చేసుకుంటానని పేర్కొన్నారు. తన వారసత్వం అయిన తన కూతుళ్లకు రాజకీయాలపై ఆసక్తి లేదని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినా తనకు మంత్రి పదవిపై ఆసక్తి లేదని అన్నారు. రోడ్లను బాగుచేయడమే తన ధ్యేయమని, తన నియోజకవర్గంలో పర్మినెంట్ రోడ్ స్ట్రక్చర్ ప్లానింగ్ చేస్తానన్నారు.
తన తాలుకాలో రోడ్లు, కాలువలు, వాల్స్లకు రూ. 500 నుంచి రూ. 600 కోట్లు ఖర్చు అవుతాయని, వాటిని సీఎం జగన్ దగ్గర అర్జి పెట్టుకొని ఆ పనులన్ని పూర్తి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. తన తమ్ముడి కొడుకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని, అయితే టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీకి పనిచేస్తానని చెప్పారు. ఈ మాటలపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. సానుభూతి కోసమే ఇలా డ్రామాలు ఆడుతున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.