Tenth Exams : తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు సమీపిస్తున్న వేళ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
Tenth Exams : తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు సమీపిస్తున్న వేళ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 40 రోజుల ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. తెలంగాణలో ఈసారి పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత శాతం తీసుకురావాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల తాజా షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 18న ప్రథమ భాషా పరీక్ష, మార్చి 19న ద్వితీయ భాషా పరీక్ష, మార్చి 21న తృతీయ భాషా పరీక్ష, 23న గణితం, 26న ఫిజికల్ సైన్స్, 28న బయోలాజికల్ సైన్స్, 30న సోషల్ సైన్స్, ఏప్రిల్ 1, 4 తేదీలలో సంస్కృతం, అరబిక్. అయితే ఈ ఏడాది ఫిజికల్ సైన్స్, బయాలజీ రెండు సబ్జెక్టులకు వేరు వేరుగా పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. 10వ తరగతి విద్యార్థులు నిర్ధారిత సమయానికి హాజరు కావాలని, ఆలస్యం కాకుండా చూసుకోవాలని అధికారులు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 లక్షల 8 వేల 385 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. అందుకు గానూ 2, 676 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతరత్రా పేపర్లకు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లకు bse.Telangana.gov.in సంప్రదించవచ్చు.