Kerala: ప్రస్తుతం ఎక్కువగా ఏఐ టెక్నాలజీ పేరు వినిపిస్తుంది. వచ్చిన తక్కువ రోజుల్లోనే బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించి కొందరు బాగా ఫేమస్ అవుతున్నారు. అయితే ఈ టెక్నాలజీ మొన్నటివరకు ఐటీ కంపెనీల వరకు మాత్రమే పరిమితం అయితే ఇప్పుడు స్కూల్స్ వరకు వచ్చేసింది. కేరళలోని తిరువనంతపురంలోని ఓ స్కూల్లో ఏఐ టీచర్ని ప్రవేశపెట్టారు. కొచ్చికి చెందిన ఓ స్టార్ట్ప్, మేకర్ల్యాబ్స్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అక్కడ ఏఐ టెక్నాలజీ టీచరమ్మ పాఠాలు ఎలా చెబుతుందో చెక్ చేశారు. ఈ టీచర్ అచ్చమైన భారతీయ పంతులమ్మగా కనిపించింది.
సుమారుగా మూడువేత మంది విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు అర్థం కాని వాటిని పదే పదే చెబుతూ.. సందేహాలు క్లియర్ చేసింది. మొత్తం మూడు భాషల్లో ఈమె మాట్లాడుతోంది. ఈ టెక్నాలజీ టీచరమ్మ ఆడ వాళ్లు ఎలా మాట్లాడుతారో అలానే మాట్లాడుతుంది.. మామూలు మనుషులు ఎలాగైతే విద్యార్థులకు వివరంగా చెబుతారో అలాగే చాలా చక్కగా చెప్పడంతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మేకర్ల్యాబ్స్ ఎడ్యూటెక్ ప్రవేశపెట్టిన ఈ ఏఐ పంతులమ్మ పేరు ఐరిస్. మొత్తం మూడు భాషల్లో మాట్లాడగలదు. ఈ ఏఐ ఆధారిత టీచర్ దేశంలో మొట్టమొదటి మానవరూప రోబోట్ ఉపాధ్యాయురాలిగా నిలిచింది.