»War In Between Mega Akkineni And Nandamuri Families
Dasara 2024: మెగా, అక్కినేని, నందమూరి హీరోల మధ్య బాక్సాఫీస్ యుద్ధం!
టాలీవుడ్ లో మెగా, అక్కినేని, నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా నడుస్తోన్న బాక్సాఫీస్ యుద్ధం ఈ దసరా మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ మూడు ఫ్యామిలీల నుండి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రాలు ఈ దసరాకి విడుదల కానున్నట్లు ప్రకటించడంతో సినీ అభిమానులలో ఆసక్తి నెలకొంది.
పవన్ కళ్యాణ్ ‘OG’
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను 2024 సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. RRR నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా వరకు బాక్సాఫీస్ వసూళ్లు కొల్లగొట్టాలని టార్గెట్ గా పెట్టుకుంది.
ఎన్టీఆర్ ‘దేవర’
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి భాగాన్ని అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. RRR తర్వాత తారక్ నుంచి రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నాగచైతన్య ‘తండేల్’
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ను అక్టోబర్ 11న విడుదల చేయాలని భావిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్.
బాలకృష్ణ ‘NBK 109’
బాబీ దర్శకత్వంలో నటసింహం నటిస్తోన్న ఈ చిత్రాన్ని 2024 విజయ దశమికే విడుదల చేయాలని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భావిస్తున్నారట. అక్టోబర్ 3వ తేదీని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ దసరా పోరులో ఎవరు ఎవరిపై పైచెయ్యి సాధిస్తారనేది పక్కన పెడితే, ఈ విజయ దశమి పోరు మాత్రం చాలా రసవత్తరంగా మారే అవకాశం వుంది. ఈ ఫైట్ కోసం టాలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు ఫ్యామిలీల హీరోల సినిమాలు ఒకే సీజన్ లో విడుదల కావడం చాలా అరుదైన విషయం. దసరా సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకోవడానికి ఈ మూడు చిత్రాల నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ బాక్సాఫీస్ యుద్ధం ఎవరికి అనుకూలంగా ముగుస్తుందో చూడాలి.