»After The Delivery Ileana Suffered From Depression
Ileana D’Souza: డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు గురయ్యాను
డెలివరీ తరువాత నటీ ఇలియాన తీవ్ర డిప్రెషన్‌కు గురయినట్లు తెలిపింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయట పడుతున్నట్లు చెప్పుకొచ్చింది. తాజాగా మరో సమస్య తనను వెంటాడుతున్నట్లు వెల్లడించింది.
After the delivery, Ileana suffered from depression
Ileana D’Souza: గోవా బ్యూటీ ఇలియాన గురించి తెలియని తెలుగు సినిమా ప్రేమికుడు ఉండడు. దేవదాసు (Devadasu) సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలతో అలరించింది. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పోకిరి (Pokiri)తో ఇండస్ట్రీ హిట్ సినిమాలో భాగస్వామ్యం పొందింది. పోకిరి తరువాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ అగ్ర హీరోలందరితో నటించింది. ఆ సమయంలో బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ వర్కౌట్ అవలేదు. మళ్లీ టాలీవుడ్‌కు వచ్చింది కానీ లాభం లేదు. అదే సమయంలో ఇలియాన ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అందరికిి చెప్పింది. పెళ్లి కాకుండానే ఈ భామ తల్లిగా మారింది. గత ఏడాది ఆగస్టు 1న మగ బిడ్డకు (Baby boy) జన్మనిచ్చింది. తన బాబు కోవా ఫీనిక్స్ డోలన్ అనే పేరు పెట్టింది.
తను తల్లి కావడానికి ముందు ఒక వ్యక్తితో బ్రేకప్ తరువాత తీవ్ర డిప్రెషన్‌కు వెళ్లినట్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. తాజాగా తాను ప్రెగ్నన్సీ తర్వాత కూడా డిప్రెషన్‌కు గురవుతున్నట్లు ఒక పోస్ట్ పెట్టింది. డెలివరీ (Delivery) తర్వాత ప్రతీ మహిళకు డిప్రెషన్ ( Depression ) అనేది సర్వసాధారణం. ఇప్పుడు దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. డెలివరీ తర్వాత నిద్రలేమి సమస్య పెరిగినట్లు చెప్పుకొచ్చింది. వీటి నుంచి బయటపడడం కోసం ప్రతి రోజు వ్యాయామం( Exercise ) చేస్తుందట. తన కుటుంబం తనకు అండగా నలిబడిందని, తన కొడుకు ఆలనా పాలనా చూసుకోవడం వలన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కూడా చేయలేకపోతున్నా అని చెప్పుకొచ్చింది.