»Woman Had Needle And Thread In Her Stomach For 11 Years
Viral : వీడేం డాక్టరు.. ఆపరేషన్ చేయమంటే కడుపులో సూది, దారం పెట్టి మర్చిపోయాడు
కొలంబియా నివాసి మారియా నలుగురు పిల్లల తల్లి. గత దశాబ్ద కాలంగా ఆమె కడుపులో వింత నొప్పితో బాధపడుతోంది. మొదట ఈ నొప్పి మామూలుదే అనుకుంది. కానీ రాను రాను తనకు సమస్య పెద్దదైంది. నొప్పి భరించలేక డాక్టర్ దగ్గరకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఎంఆర్ఐ చేయగా, వైద్యులు చూసిన దృశ్యం చూసి షాక్ అయ్యారు.
Viral : ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్య సమస్య వచ్చిందని డాక్టర్ల(Dotor) దగ్గరికిపోతే కొన్ని సందర్భాల్లో వాళ్లు చేసిన తప్పిదాల వల్ల రోగులు ఇబ్బందిపడిన ఘటనల గురించి చాలానే విన్నాం.. అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. డాక్టర్ చేసిన తప్పు వల్ల ఓ మహిళ 11ఏళ్లుగా కడుపునొప్పితో బాధపడాల్సి వచ్చింది.
కొలంబియా(Columbia) నివాసి మారియా నలుగురు పిల్లల తల్లి. గత దశాబ్ద కాలంగా ఆమె కడుపులో వింత నొప్పితో బాధపడుతోంది. మొదట ఈ నొప్పి మామూలుదే అనుకుంది. కానీ రాను రాను తనకు సమస్య పెద్దదైంది. నొప్పి భరించలేక డాక్టర్ దగ్గరకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఎంఆర్ఐ(MRI) చేయగా, వైద్యులు చూసిన దృశ్యం చూసి షాక్ అయ్యారు. ఆ సమయంలో వైద్యులు మరియా కడుపులో సూది దారాన్ని కనుగొన్నారు.
మారియాకు ప్రస్తుతం 39 సంవత్సరాలు. కొలంబియాలో నివసిస్తూ ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. తర్వాత ఎక్కువ మంది పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ఆపరేషన్(Operation) చేయించుకుంది. ఈ ఆపరేషన్ తర్వాతే తనకు కడుపులో నొప్పి ప్రారంభమైంది. దీనిపై వైద్యుడిని ఆశ్రయించగా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు(Pain Killer Tablets) ఇచ్చారు. కడుపునొప్పి ఎక్కువై చాలా రాత్రులు నిద్రలేకుండా గడిపింది. డాక్టర్ క్లినిక్ ఉన్న పట్టణం ఆమె నివసించే గ్రామానికి చాలా దూరంలో ఉన్నందున ఆమె 10 సంవత్సరాలు బాధ అనుభవించింది.
చివరగా, చాలా సంవత్సరాల బాధ తర్వాత, మరియా తిరిగి డాక్టర్ వద్దకు వెళ్లింది. చివరగా అక్కడ ఆమెను అల్ట్రాసౌండ్, MRI స్కాన్ చేయించుమని సిఫార్స్ చేశాడు. అప్పుడు ఆమె కడుపులో శస్త్రచికిత్స సూది, దారం కనుగొనబడ్డాయి. ఆమె కడుపు నొప్పికి ఇదే కారణమని వైద్యులు గ్రహించారు. ఈ సూది దారం ఆమె కడుపులో దాదాపు 4000 రోజుల పాటు ఉంది. ఆమె ఫెలోపియన్ ట్యూబ్కి ఆపరేషన్ చేసినప్పుడు, డాక్టర్ పొరపాటు వల్ల మరియా కడుపులో సూది దారం మర్చిపోయాడు. చివరగా డాక్టర్ ఆపరేషన్ చేసి కడుపు నుండి సూది-దారం తొలగించారు. అప్పుడు ఆమె నొప్పి తగ్గిపోయింది.