ప్రైవేట్ సంస్థల్లో అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో అయినా ఎక్కడైనా మనుషులే ఉద్యోగాలు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ (Bhavish Agarwal) కుక్కలపై తన ప్రేమను చాటుకున్నారు. అతడు కుక్కకు ‘బిజిలీ’ అనే పేరు పెట్టి తన సంస్థలో ఉద్యోగ అవకాశం కల్పించారు. దానికి కేటాయించిన ఐడీ కార్డ్ ట్విటర్లో పంచుకున్నారు. ఐడీలో కుక్క ఎంప్లాయ్ కోడ్, బ్లడ్ గ్రూప్, ఆఫీస్ అడ్రస్ వివరాలు పేర్కొన్నారు. కుక్క(Dog)కు ఎంప్లాయి హోదా ఇచ్చిన మీరు గ్రేట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు.
నివేదికల ప్రకారం, బిజ్లీ (Bijlee) అనే శునకాన్ని కంపెనీ ఉద్యోగిగా చేర్చుకున్నట్లు భవిష్ అగర్వాల్ అధికారికంగా వెల్లడించాడు. దీనికి 440V అనే ఎంప్లాయ్ ఐడీ, బ్లడ్ గ్రూప్, అడ్రస్ వంటి వాటిని కూడా దాని కార్డులో మెన్షన్ చేశారు. ఇతర ఉద్యోగులకు మాదిరిగానే దీనికి సకల సదుపాయాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఓలా(Ola) సీఈఓ గతంలో కూడా కుక్కలకు సంబంధించిన పోస్టులను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. అయితే ఈ సారి ఉద్యోగమిచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇది కోరమంగళ ఇండస్ట్రియల్ ఎస్టేట్, హోసూర్ రోడ్డు, బెంగళూరు(Bangalore)లో పనిచేయనుంది. ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఈ కుక్క ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది.