పెద్ద పెద్ద నగరాల్లో మాత్రం పబ్ల సాంప్రదాయం పెరుగుతోంది. తాజాగా నోయిడాలోని ఓ పబ్లో డీజే స్క్రీన్ పై రామాయణం(Raamaayanam) ప్రదర్శితమైంది. పబ్(Pub) నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నేటి సమాజంలో పబ్(Pub)ల కల్చర్ పెరుగుతోంది. చాలా మంది పబ్ లకు వెళ్లడం, డీజే సాంగ్స్ (DJ songs) ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ (Dance) వేయడం వంటి కల్చర్ (Culture)కు అలవాటు పడుతూ వస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో దీని గురించి అంతగా పట్టించుకోకపోయినా పెద్ద పెద్ద నగరాల్లో మాత్రం పబ్ల సాంప్రదాయం పెరుగుతోంది. తాజాగా నోయిడాలోని ఓ పబ్లో డీజే స్క్రీన్ పై రామాయణం(Ramayanam) ప్రదర్శితమైంది.
1987లో దూరదర్శన్ ఛానెల్ లో వచ్చిన రామాయణం(Ramayanam) సీరియల్ సీన్స్ పబ్ లో స్క్రీన్ పూ ప్రసారమయ్యాయి. అప్పట్లో ఆ సీరియల్ సూపర్ హిట్ అయ్యింది. పబ్ (Pub)లో ఓ వైపు స్పీకర్ లోంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ వస్తుండగా మరో వైపు స్క్రీన్ పై రామాయణం సీరియల్ ప్రసారమైంది. అక్కడున్నవారంతా దానిని చూసి ఉత్సాహంగా డ్యాన్స్ వేశారు.
లార్డ్ ఆఫ్ ద డ్రింక్స్ అనే పేరుతో ఉండే ఆ పబ్ నోయిడాలోని గార్డెన్స్ గలేరియాలో ప్రాంతంలో ఉంది. డీజే స్క్రీన్ పై రామాయణం(Ramayanam) ప్రసారం అయిన విషయం పోలీసులకు తెలిసింది. దానిని సుమోటోగా తీసుకుని పబ్(Pub) నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్ లో ప్రసారమైన వీడియోను ఆధారంగా తీసుకుని పబ్ యజమాని పూజా చౌదరి, ఆమె భర్త మానక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.