ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్(mount everest). ఇది నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉండగా, దీని ఎత్తు 8,848.86 మీటర్లు. ఇది హిమాలయాలలోని మహలంగూర్ హిమల్ ఉప శ్రేణిలో ఉంది. ఈ శిఖరాన్ని ప్రతి ఏటా కొంత మంది పర్వతారోహకులు ఎక్కేందుకు ఇష్టపడతారు. అంతేకాదు ఈ ప్రదేశం అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ భయంకరమైన చలితోపాటు అతి తక్కువ ఆక్సిజన్ లెవల్స్ ఉంటాయి. దీంతో కొద్ది మంది మాత్రమే ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు సాహాసం చేస్తుంటారు.
ఇటీవల పలువురు పర్వతారోహకులు ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన తర్వాత ధైర్యం చేసి 360 డిగ్రీ వ్యూలో ఓ వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియోను పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. వీడియోలో ఎవరెస్ట్ పర్వతం చుట్టూ అనేక మంచుతో కప్పబడిన శిఖరాలు కనిపిస్తున్నాయి. కెమెరా కుడివైపుకి పాన్ చేస్తున్నప్పుడు, కొన్ని మేఘాలు కూడా శిఖరం కంటే తక్కువ ఎత్తులో తేలుతున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పర్వత అందాలు చాలా బాగున్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం ఎవరెస్ట్ శిఖరం యొక్క అద్భుత దృశ్యాలను తమకు చూపించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
What a beautiful sight ! My husband amd Son did the Everest base camp few years ago and were fortunate to see amazing views of the mighty Everest .