»Mahesh Babu Brothers Daughter Amazing Dance Video Viral
Viral Video: మహేశ్ బాబు అన్న కూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో వైరల్
గుంటూరు కారం సినిమాలో కుర్చి మడట పెట్టి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికిీ తెలిసిందే. అందుకే చాలా మంది రీల్స్ చేస్తూ తమ సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. తాజాగా మహేష్ బాబు అన్న కూతురు కూడా ఈ పాటకు స్టెప్ వేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. దాంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Mahesh Babu Brother's daughter amazing dance.. Video viral
Viral Video: మహేష్ బాబు, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన గుంటూరు టాకీస్ ఈ సంక్రాంతి బరిలో నిలిచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ స్పెషల్ సాంగ్ అయిన కుర్చి మడతపెట్టి పాటలో మహేష్, శ్రీలీల డ్యాన్స్ చాలా బాగా చేశారు. థియేటర్లో అభిమానులు సైతం తమను తాము మైమరిచి ఈ సాంగ్ వచ్చినప్పుడు డ్యాన్స్ చేశారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద బజ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా యూఎస్ నుంచి మహేష్ అన్న కూతురు వేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది.
మహేష్ బాబు అన్న కూతురు భారతిఘట్టమనేని కుర్చి మడతపెట్టి సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. కిచెన్‌లో తన పనులు చేసుకుంటూ సాంగ్‌కు తగ్గట్టు పెదాలు కదుపుతూ.. ఓ మంచి మూమెంట్ చేసింది. చాలా ఎనర్జిటిక్‌గా, అంతే క్యూట్ ఎక్స్‌ప్రేషన్స్‌తో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.