లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ సీఈవో జెన్స్ రిట్టర్ ఓ క్రూ వలే విమానంలో విధులు నిర్వర్తించారు. ప్రయాణంలో సిబ్బంది సవాళ్లు, ప్రయాణికుల అవసరాలను తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
Lufthansa Airlines: అప్పుడప్పుడు సీఈవోలు, బాస్లు సిబ్బందికి తెలియకుండా సర్వీస్ చేస్తుంటారు. మన కంపెనీ సర్వీస్ ఎలా ఉందో క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఇలా చేస్తుంటారు. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ (Lufthansa Airlines) సీఈవో జెన్స్ రిట్టర్ కూడా అలానే చేశారు. ఫ్రాంక్ ఫర్డ్ నుంచి రియాద్ వెళ్లే విమానంలో అదనపు సిబ్బందిగా చేరి.. ప్రయాణికులకు సేవలను అందజేశాడు. ఫ్లైట్లో సర్వీస్ చేశానిని అతనే లింక్ డిన్లో పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది.
జెన్స్ రిట్టర్ జర్మనీకి (germany) చెందిన వారు.. అతని కంపెనీ కూడా అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా సర్వ్ చేస్తోంది. విమానంలో ప్రయాణం చేసే సమయంలో సిబ్బంది సవాళ్లు, ప్రయాణికుల అవసరాలను తెలుసుకునేందుకు ట్రావెల్ (travel) చేశానని తెలిపారు. కొత్త అనుభవాలు తెలుసుకోవాలంటే ప్రయాణం మార్చుకోవాల్సిందేనని అంటున్నారు. సిబ్బందితో కలిసి ట్రావెల్ చేశానని రాసుకొచ్చారు.
కంపెనీ వ్యవహారాలు.. అధికారులతో ఎప్పుడూ కలుస్తామని.. క్యాబిన్ సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశం ఎప్పుడూ రాలేదని తెలిపారు. ఎక్స్పీరియన్స్ ఆసక్తికరంగా ఉందని రాసుకొచ్చారు. ప్రతీ ప్రయాణానికి ముందు అవసరమైన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయానని వివరించారు. ఇక్కడ ఓ లోపం కనిపించిందని తెలిపారు.
మెనుకార్డులో భోజనం.. ప్రయాణ సమయంలో అందజేసే ఫుడ్ మధ్య తేడా స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని.. సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. విమాన సిబ్బందిని కూడా అభినందించారు.