KTR: తాజాగా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తనయుడు హిమాన్షూ ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. కుమారుడిని మిస్ అవుతున్నానని రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్ వైరల్ అవుతోంది. కేటీఆర్ ముద్దుల తనయుడు హిమాన్షూ ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నాడు. కుమారుడిని బాగా మిస్ అవుతూ ఈ పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్లు స్పందించారు. మీరు ఎలాగో హిమాన్షూను మిస్ అవుతున్నారో.. మీ కుమారుడు కూడా మీలాగే మిస్ అవుతుంటాడు. ప్రస్తుతం హిమాన్షూ మీ కంటికి ఎదురుగా లేడని బాధ అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో కుమారుడి విజయాలు చూసి మీరే మురిసిపోతారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
హిమాన్షూ గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. తర్వాత పై చదువుల కోసం ఆగస్టులో అమెరికా వెళ్లారు. హిమాన్షూతో పాటు కేటీఆర్ దంపతులు, చెల్లి అలేఖ్య కూడా వెళ్లారు. అడ్మిషన్ ప్రక్రియ పూర్తికాగానే కేటీఆర్ ఇండియాకు తిరుగు పయనం అయ్యారు. హిమాన్షూ సామాజిక సేవలో ముందుంటాడు. దీనివల్ల హిమాన్షూకు సీఏఎస్ ఎక్సలెన్స్ అవార్డు కూడా లభించింది. ఇటీవల ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని రూ.కోటి వెచ్చించి మరి ఆ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే.