»Instead Of Wife He Took Another Woman On The Bike Haveri Karnataka
Wife:కు బదులు మరో మహిళను బైక్ పై తీసుకెళ్లాడు..తర్వాత ఏమైందంటే
ఓ పెట్రోల్ బంకు నుంచి భార్యను తీసుకెళ్లడానికి బదులు మరో వ్యక్తి భార్యను తీసుకెళ్లిన ఫన్నీ సంఘటన ఇటీవల కర్ణాటకలో జరిగింది. ఆ తర్వాత వారు విషయం తెలుసుకుని తిరిగి రాగా..ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.
ఇటీవల ఓ పెట్రోల్ బంకు వద్ద విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య(Wife)కు బదులుగా అక్కడే ఉన్న మరో వ్యక్తి భార్యను తన బైకుపై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. తీరా కొంచెం దూరం వెళ్లాక తన వైఫ్ కాదని తెలిసి ఆశ్చర్యపోయి తిరిగి వచ్చాడు. ఈ సంఘటన ఇటీవల కర్ణాటక(karnataka)లోని హవేరి జిల్లా(haveri district)లో జరుగగా..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.
భార్య, భర్త(husband) కలిసి ఓ బైకుపై వెళుతున్న క్రమంలో పెట్రోల్ కోసం ఓ బంక్ దగ్గర వాహనం ఆపుకున్నారు. ఆ క్రమంలో భార్యను ఓ పక్కన నిలబడమని భర్త అక్కడి క్యూలైన్లో ఉండి పెట్రోల్ నింపుకున్నాడు. తర్వాత అక్కడే నిలుచున్న మహిళ దగ్గరకు వచ్చి బండి ఎక్కమని అనగా..ఆమె ఎక్కగానే ఇంటికి తీసుకెళ్లాడు. బైకుపై వెళ్లే క్రమంలో ఆమె మన ఇల్లు ఇటు కాదు. అటు కాదా అంటూ మాట్లాడగానే భర్త ఒక్కసారిగా ఆమెను చూసి అవాక్కయ్యాడు. ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకుని, మళ్లీ తిరిగి పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లగా అక్కడ భార్య కోసం భర్త, తనను వదిలేసి వెళ్లిన భర్త కోసం భార్య వేచి చూస్తున్నారు.
అయితే ద్విచక్రవాహనంపై మహిళను తీసుకెళ్లిన వ్యక్తి భార్య మాదిరిగా.. ఆమె కూడా అదే రంగు చీర కట్టుకుని ఉండటం వల్ల అనుకోకుండా అలా తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవైపు బైకుపై వెళ్లిన ఆ మహిళ భర్తకు కూడా..అలాంటిదే బైక్, హెల్మెట్ ధరించి ఉండటం వల్లే ఆ మహిళ పొరపాటున బైక్ ఎక్కి వెళ్లినట్లు తర్వాత వివరించింది. ఈ విషయం తెలుసుకుని ఇద్దరు ఫ్యామిలీలు కాసేపు నవ్వుకున్నారు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఎంటి బ్రో అలా తీసుకెళ్లావని అంటున్నారు. మరికొంత మంది అయితే ఆ మహిళనైనా సరిగా చూసుకోవాలి కదా. ఎవరో ఎంటో చూసుకోకుండా బైక్ ఎక్కి వెళితే ఎలా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.