పాకిస్తాన్ కేబినెట్ లో తీవ్రవాది యాసిన్ మాలిక్ (Yasin Malik) సతీమణి మిశాల్ హుస్సేన్ మాలిక్ కు చోటు కల్పించడం పై హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ (Pakistan) మీడియా తప్పుపట్టింది. పాక్ తాతకాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అన్వర్-ఉల్-హాక్ కకర్ తాత్కాలికంగా కేబినెట్ విస్తరించారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో షెబాజ్ షరీఫ్ (Shebaz Sharif) తమ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అనంతరం ఆగస్టు 15న అన్వర్-ఉల్-హాక్ కకర్ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్బంగా ఆయన నియమించిన కొత్త కేబినెట్ మంత్రుల జాబితాలో మానవ వనరుల శాఖ మంత్రిగా మిశాల్ హుస్సేన్ మాలిక్ (Hussain Malik) ను నియమించినట్లు తెలిపారు. మిశాల్ భర్త జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ తీవ్రవాదులకు నిధులను సమకూర్చిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేరస్తుడిగా నిర్ధారించగా కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. కాగా ప్రస్తుతం యాసిన్ మాలిక్ శిక్షను అనుభవిస్తున్నాడు. మిశాల్ హుస్సేన్ మాలిక్ తో పాటు ఆర్ధిక మంత్రిగా మాజీ సెంట్రల్ బ్యాంకు చీఫ్ షంషాద్ అఖ్తర్(Shamshad Akhtar), అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా సర్ఫరాజ్ బుగాటి నియమితులయ్యారు. వీరితో పాటు మొత్తం 16 మంది మంత్రులతో కూడిన పాకిస్తాన్ కేబినెట్ తో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి (Arif Alvi) ప్రమాణ స్వీకారం చేయించారు.