Bihar Board 12th exam:చదవాలనే ఆసక్తి ఉండాలే కానీ.. ఏమైనా సాధించొచ్చు. మంచి ప్రతిభను కనబరచొచ్చు. బీహర్‌కు (bihar) చెందిన ఓ విద్యార్థిని ఇలా సత్తా చాటారు. పన్నెండో తరగతిలో మంచి మార్కులను సాధించారు. ఆమె సొంతంగా చదువుకునే మంచి మార్కులు పొందడం విశేషం. కాలేజీలో చేరినప్పటికీ.. ఇంటి వద్ద రాత్రింబవళ్లు కూర్చొని కష్టపడి చదివారు. ట్యూషన్, స్పెషల్ క్లాసులకు వెళ్లలేదు.

బీహర్ గయలో (gaya) గల పాత కరీంమ్ గంజ్‌కు చెందిన కోమల్ కుమారి (komal kumari) సెకండ్ టాపర్‌గా నిలిచారు. కామర్స్ విభాగంలో 500 మార్కులకు గానూ.. 474 మార్క్స్ పొందారు. ఇప్పుడే కాదు పదో తరగతిలో కూడా ఆమె మంచి మార్కులను సాధించారు. గయలో గల మిర్జా గాలిబ్ కాలేజీలో ఆమె బ్యాచ్‌లర్ ఆఫ్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. తన విజయానికి కారణం.. తల్లిదండ్రులు, లెక్చరర్స్ అని అంటోంది కోమల్.
మిగతా వారిలాగా ఐఏఎస్ (Ias), ఐపీఎస్ (ips) అవుతానని కోమల్ (komal) చెప్పడం లేదు. టీచర్ (teacher) అయి.. సమాజానికి సేవ చేస్తానని చెబుతోంది. కోమల్ తండ్రి అశోక్ కుమార్ (ashok kumar).. అతనికి ఓ పిండి గిర్నీ ఉంది. ఆమె తల్లి గృహణి కాగా.. పేదరికంలో కూడా ఇద్దరు కూతుళ్లను (daughters) అశోక్ (ashok) చదివిస్తున్నారు. తన కూతురు రాత్రింబవళ్లు కష్టపడి చదివేది అని అశోక్ కుమార్ మీడియాకు చెప్పారు.
నిజమే.. కడు పేదరికంలో కూతుళ్లను అశోక్ చదివించగా.. కోమల్ మంచి ప్రతిభ చాటారు. అంతేకాదు తాను టీచర్ అయి.. తనలాంటి పేదలకు మంచి విద్యను అందిస్తానని చెబుతున్నారు. మరెందరికో ఆదర్శంగా నిలుస్తానని చెబుతున్నారు. సో.. కోమల్‌కు నెటిజన్లు ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు.