పంజాబ్ రాష్ట్రం(Punjab State)లో బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి. ముల్లు వెనక్కు తిరిగే గడియారం తయారు చేశాడు. నేటి యుగంలో శాస్త్రం, సాంకేతికత ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. వాటికి తగ్గట్టుగానే యువత బీటెక్, ఎంబీబీఎస్ (MBBS) లో చేరి రాణిస్తున్నారు. అలాగే కాలంతో పాటూ పరుగులు తీయాలనుకునే వారు కొందరు ఉంటారు. కానీ కాలాన్నే వెనక్కి తిప్పాలనుకున్నాడు ఈ ఇంజనీరింగ్ విద్యార్థి. ఇందులో భాగంగా రివర్స్ లో తిరిగేలా గడియారాన్ని (clock) తయారు చేశారు. ఇలా రివర్స్‌లో తిరిగినప్పటికీ ఇది టైమ్ మాత్రం కచ్చితంగా చూపించడం విశేషం. నేటి యుగంలో శాస్త్రం, సాంకేతికత ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి.
వాటికి తగ్గట్టుగానే యువత బీటెక్, ఎంబీబీఎస్ లో చేరి రాణిస్తున్నారు. అలాగే కాలంతో పాటూ పరుగులు తీయాలనుకునే వారు కొందరు ఉంటారు. కానీ కాలాన్నే వెనక్కి తిప్పాలనుకున్నాడు ఈ లోకంలో సాధించాలనే పట్టుదల ఉంటే ఎలాంటి దానినైనా సాధించవచ్చు అని బలంగా నమ్ముతాడట. అందుకే మనమే ఈ గడియారాన్ని (Clock) ఎందుకు తయారు చేయకూడదు అని సంకల్పించుకున్నారు. దీనికోసం విపరీతంగా కష్టపడి వ్యతిరేకదిశలో తిరిగే గడియారాన్ని తయారుచేశాడు. దీనికి ప్రత్యేకతను సంతరించుకోవడం కోసం క్లాక్‌లోని అక్షరాలను పంజాబీ భాష(Punjabi language)లో ఉంచానని వివరించారు. గతంలో చిన్న టేబుల్ ఫ్యాన్ కూడా తయారు చేశాడట. అందుకు గానూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం ఏర్పరుచుకున్నానని తెలిపారు.