Ladies Marriage:ఓకే లింగానికి చెందిన వ్యక్తుల పెళ్లిళ్ల గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో జంట మీడియా ముందుకు వచ్చారు. వారిద్దరు వదిన-మరదళ్లు కావడం విశేషం. ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) సంభాల్ జిల్లాకు చెందిన వారు మ్యారేజ్ చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహానీ (death threat) ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.
సంభాల్ జిల్లా బహ్ బోయ్కు చెందిన యువతి.. తన మరదలితో కలిసి నోయిడాలో పనిచేస్తోంది. ఆ సమయంలో ఇద్దరు దగ్గర అయ్యారు. తర్వాత కొద్దీరోజులకు అక్కడి నుంచి పారిపోయారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో వెతికారు. అయినప్పటికీ జాడ తెలియలేదు. దీంతో మిన్నకుండిపోయారు.
వదిన-మరదలు ఆదివారం బహ్ జోయ్ పోలీస్ స్టేషన్ వచ్చారు. తాము పెళ్లి చేసుకున్నామని స్టేషన్లో (station) చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. నచ్చజెప్పి.. ఎవరి ఇంటికి వారిని పోలీసులు పంపించారు. ఓకే లింగానికి చెందిన వ్యక్తుల పెళ్లికి ఢిల్లీ హైకోర్టు సమ్మతించిన సంగతి తెలిసిందే. ఆ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.